ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ మునిసిపల్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పనిచేయుచున్న ప్రధానోపాధ్యాయులు / ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (TIS) మరియు D.S.C ల వారీగా మార్కులు / మెరిట్ ఆధారముగా రూపొందించడం జరిగినది.
అభ్యంతరాలు స్వీకరణ:
సీనియారిటీ జాబితాపై ఎవరికైనా అభ్యంతరాలుంటే 26-03-2025 లోపు తగు ఆధారాలతో జిల్లా సైన్స్ సెంటర్, శారధానగర్, అనంతపురము నందు సమర్పించవలయును. అభ్యంతరము తెలుపు ఉపాధ్యాయులు వారి యొక్క పూర్తి వివరాలు మరియు ఆధారాలతో అభ్యంతరములు తెలుపవలసియుండును. గడువు మీరిన తరువాత అభ్యంతరాలు స్వీకరించబడవు.
జిల్లా విద్యాశాఖాదికారి,అనంతపురము
0 Comments